దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా

0 10

అమరావతి ముచ్చట్లు :

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉమపై జి.కొండూరు పోలీసు స్టేషన్ లో అక్రమ కేసులు నమోదయ్యాయని ఉమ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు దేవినేని ఉమను తమ కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఉమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై హత్యాయత్నం, కుట్రతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Devineni Uma’s bail petition hearing adjourned to Monday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page