పుంగనూరులోని సచివాలయాలలో నిర్ధేశించిన పనులు చేయాల్సిందే – సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి

0 35

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు సచివాలయాలలో సేవలు ప్రజలకు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి హెచ్చరించారు. శుక్రవారం ఆమె మున్సిపాలిటిలోని పలు సచివాలయాలను, మండలంలోని బోడేవారిపల్లె సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అర్జీల నమోదు, వాటిపై చర్యలు గూర్చి పరిశీలించారు.ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ సచివాలయాల పనితీరు, డిజిటల్‌ నమోదు కార్యక్రమాలను సబ్‌కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ సచివాలయ ఉద్యోగులతో పలురకాల విషయాలపై చర్చించారు.ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలసత్యం వహించినా వేటు తప్పదని హెచ్చరించారు. ఈమె వెంట ఎంపీడీవో రాజేశ్వరి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఆర్‌ఐ ప్రసాద్‌ తదితరులు పర్యటించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: The prescribed works are to be done in the secretariats at Punganur – Sub-Collector Jahnavi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page