పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ దృష్టి పెట్టాలి

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:

జులై 27 ,28 లలో సీపీఐ బృందం వివిధ జిల్లాలో పర్యటించాం. పాలమూరు రంగారెడ్డి పథకం పనులు జరుగుతున్న తీరును పరిశీలించం. కృష్ణ జలాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జలజగడం మొదలైంది. కృష్ణ జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలోను,తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరిగింది. పాలమూరు రంగారెడ్డి పై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలుపుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
2009 లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల ఎకరాలకు కృష్ణ నది నుండి తీసుకోవాలని జీవో రిలీజ్ చేశారు. సీఎం కేసీఆర్ 2015 లో పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసేందుకు 32 వేల కోట్లతో ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టారు. ఈ 5 ప్రాజెక్టులకు ఇప్పటి వరకు 13 వేల కోట్లు ఖర్చు చేశారు. 26 వేల ఎకరాలకు 18 వేల ఎకరాల భూసేకరణ జరిగింది. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు… ఇప్పటికి  పూర్తవుతుందో చెప్పాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల తీసుకోవాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవు. ఆలస్యం చేస్తే పాలమూరు ఎత్తిపోతల అంచనాలు పెరుగు తాయని అన్నారు.
కాళేశ్వరం మీద ఎంత దృష్టి పెట్టారో.. పాలమూరు పైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన పథకం పూర్తి చేయాలి.  ఎస్ఎల్బీసీ  సొరంగం వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో ప్రారంభమైంది ఇంకా పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ  పై ప్రత్యేక దృష్టి సారించి 1500 కోట్లు కేటాయించాలి. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం 690 కోట్లతో 2007 లో ప్రారంభమైన ఇది పూర్తి కాలేదు. దీనికి ఇంకా 500 కోట్లు కేటాయిస్తే భూ సేకరణ చేసి త్వరగా పూర్తి చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలి. ముఖ్యమంత్రి అపోయింమెంట్ అడుగుతున్నాం..పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రం అందిస్తామని అయన అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:KCR should focus on pending projects

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page