పేదలకు ప్రగతి భవనం : బండి సంజయ్

0 17

హైదారాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బండి సంజయ్ ఒక్క అడుగు ముందుకు వేసి.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. పైగా సాగు చేసుకుంటున్న గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు దళితులు, గిరిజనులపైన చిత్తశుద్ధి లేదు. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 శాతం దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదా?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.బీజీపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని సంజయ్ తెలిపారు.

 

 

 

- Advertisement -

తొలి సంతకం ఈ ఫైల్ పైనే చేస్తామన్నారు. ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఫేక్ ఐడీలు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి.. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు.రాష్ట్రంలో దళిత హక్కు పరిరక్షణకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10వేల డప్పులతో ఉద్యమిస్తామన్నారు. 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2023లో తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. కేసీఆర్ లాఠీ, పోలీసు తూటాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరన్న బండి.. అగ్రవర్ణ పేదల పక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్‌ వెల్లడించారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Pragati Bhavan for the poor: Bandi Sanjay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page