బాక్సైట్ తవ్వకాలపై ఫలించిన  టీడీపీ పోరాటం

0 11

– స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
-అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు

 

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

- Advertisement -

బాక్సైట్ తవ్వకాలపై టీడీపీ నేతల పోరాటం ఫలించింది.. వైసీపీ కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసింది. లేటరైట్ ముసుగులో గిరిజన బతుకులు ఛిద్రం చేస్తూ.. వైసీపీ సాగిస్తున్న బాక్సైట్ దందాపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. మైనింగ్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్జీటీ నిర్ధారణకు వచ్చింది. అటవీశాఖ అనుమతులు లేకుండానే వేలాది వృక్షాలను ధ్వంసం చేసి.. రోడ్డు నిర్మాణం చేయడాన్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్  తప్పుబట్టింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్ జరిగినట్లు ఎన్జీటీ గుర్తించింది. తక్షణమే గనుల శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని, అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఎన్జీటీ ఆదేశించింది. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు ఎన్జీటీ కమిటీ ఏర్పాటు చేసింది. మన్యం ప్రాంతంలో కమిటీ సభ్యులు పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్జీటీ రంగంలోకి దిగడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: TDP fight over bauxite mining

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page