మతిభ్రమించి మాట్లాడుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

0 14

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి. ఖుతుబొద్దిన్ పాషా

కోరుట్ల ముచ్చట్లు:
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి మతిభ్రమించిందని , అందుకే తమ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అకారణంగా విమర్శించడం సరికాదన్నారు. దుబాయ్ బ్యాంకులను మోసం చేసి ఇండియా వచ్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బ్రోకర్ పనులు చేసుకుంటూ ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆర్మూర్ లో ఆర్టీసీ భూమి కబ్జా చేశారని, అలాంటి మనిషికి తమ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. కోరుట్లలో మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో పశువైద్య యూనివర్సిటీ, పసుపు పరిశోధనా కేంద్రం, సామాజిక సంక్షేమ వసతి గృహాలకు నిధులు అధిక మొత్తంలో తెప్పించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే నిజాంబాద్ లో పాస్ పోర్ట్ కార్యాలయం వచ్చిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయని, ఇవన్నీ తెలియక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన స్థాయి మరచి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మరోమారు ఇలా చౌకబారు విమర్శలు చేస్తే తగిన గుణపాఠం తప్పదు అన్నారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రామ్ ప్రసాద్, కాంగ్రెస్ యూత్ నాయకులు కోటగిరి చైతన్య, అబ్దు, తళహ, గోనెల, రాజేష్, ఇలియాస్, అబ్దుల్ అజీజ్ ,మహమ్మద్ నసిరుద్దీన్, ముజ్జు అజీజ్ ,సాజీద్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Armor MLA Jeevan Reddy talking insanely

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page