మనవడిని చంపేసిన అమ్మమ్మ

0 18

సంగారెడ్డి ముచ్చట్లు:

సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. సొంత మనవడిని అమ్మమ్మ అతి కిరాతకంగా హతమార్చింది. మరో వ్యక్తితో కలిసి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్త చనిపోయిన కుమార్తె రెండో పెళ్లికి అడ్డొస్తున్నాడని ఆమె బాలుడిని హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. గురువారం సంగారెడ్డిలో రెండేళ్ల బాలుడు యశ్వంత్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంత వెతుకులాడినా ఆచూకి లభించలేదు. అయితే శుక్రవారం బొబ్బిలకుంట చెరువులో యశ్వంత్‌ మృతదేహం కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. యశ్వంత్‌ను హత్య చేసి చెరువులో పడేసినట్లు చెప్పారు. కాగా బాలుడి తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో కుమార్తె రెండో పెళ్లి చేయాలని భావించిన సదరు మహిళ.. అందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైందివరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్‌లోని రెండో ఫ్లోర్‌ పైనుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంజీఎంలోని కరోనా వార్డులో అతడు చికిత్స పొందుతున్నాడు.  గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యక్తి సూసైడ్‌కు8 గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.ఈ నెల 24న వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ కరోనా సింటమ్స్‌తో ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు కరోనా సోకినట్లు తేలడంతో ఎంజీఎం ఆస్పత్రిలోని కరోనా విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఎంతకీ వ్యాధి లక్షణాలు తగ్గకపోవడం వల్ల మనస్తాపానికి గురైన బాధితుడు ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:The grandmother who killed her grandson

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page