మున్సిపల్ వైస్ చైర్మన్ గా అర్షపోగు ప్రశాంతి …

0 15

-అట్టహాసంగా ప్రమాణ స్వీకారం.

నందికొట్కూరు ముచ్చట్లు:

- Advertisement -

నందికొట్కూరు పురపాలక సంఘం రెండవ వైస్ చైర్మన్ గా ఎన్నికైన 22వ వార్డు కౌన్సిలర్ ఆర్ష పోగు ప్రశాంతి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నందికొట్కూరు మున్సిపాలిటీ లో  పాలక మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రెసిడింగ్ ఆఫీసర్ గా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ వ్యవహరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబందించి ప్రభుత్వం జులై 23న నోటిఫికేషన్ విడుదల చేసిందని మున్సిపల్ మేనేజర్ బేబీ ప్రభుత్వ ఉత్తర్వులను చదివి వినిపించారు. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం వైస్ చైర్మన్ పదవులను సృష్టిస్తూ మున్సిపల్ చట్టాన్ని సవరించిన నేపద్యంలో వైస్ చైర్మన్ ఎన్నికకు పాలక మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో 29మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా 25 మంది సభ్యులు హాజయ్యారు. ఎన్నికకు సంబందించి పూర్తి కోరం ఉండడంతో స్పెషల్ ఆఫీసర్ అనురాధ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వైస్ చైర్మన్ గా  ప్రశాంతి పేరును 1వ  వార్డు కౌన్సిలర్ చినరాజు ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రావుప్ బలపరిచారు.అనంతరం ప్రశాంతి ఎంపికను సభ్యులందరూ ఏకగ్రవంగా ఆమోదించారు. ఆమే ఎన్నికను ధృవీకరిస్తూ ప్రెసిడింగ్ ఆఫీసర్  ధృవీకరణ పత్రం అందజేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ  ,కమిషనర్ అంకిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Arshapogu Prashanthi as Municipal Vice Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page