యూపీలో బీహార్ రిజల్ట్స్

0 15

లక్నో   ముచ్చట్లు:

లైబీహార్ ఫలితాలు మళ్లీ ఉత్తర్ ప్రదేశ్ లో రిపీట్ కానున్నాయా? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ గెలుపునకు పరోక్షంగా సహకరిస్తారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎంఐఎం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతుంది. దాదాపు వంద నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమయింది. ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ముస్లిం ఓట్ల చీలిక సమాజ్ వాదీ పార్టీ విజయానికి అడ్డంకిగా మారనుందా? అన్న సందేహం తలెత్తనుంది.బీహార్ లో ఎంఐఎం కారణంగా తృటిలో ఆర్జేడీ కూటమి అధికారాన్ని కోల్పోయింది. ఎంఐఎం పరోక్షంగా బీహార్ లో బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిందన్న విమర్శలు విన్పించాయి. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం వంద స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓం ప్రకాష్ రాజ్ భర్ నేతృత్వంలోని భారతీయ సమాజ్ పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ పొత్తు కుదుర్చుకుందిఉత్తర్ ప్రదేశ్ లో ముస్లిం సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. సుదీర్ఘకాలం ఆ సామాజికవర్గం కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచేది. కానీ తర్వాత క్రమంలో సమాజ్ వాదీ పార్టీకి దగ్గరయింది. బీజేపీకి తొలి నుంచి దూరంగా ఉన్న ఈ సామాజికవర్గం ఓట్లు ఎంఐఎం బరిలోకి దిగితే చీలతాయన్నది వాస్తవం. అప్పుడు మంచి ఊపుమీద ఉన్న సమాజ్ వాదీ పార్టీకి అసదుద్దీన్ ఒవైసీ దెబ్బ కొట్టినట్లవుతుంది.ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీకి చెక్ పెట్టేందుకు సమాజ్ వాదీ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ముస్లిం సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంఐఎం వల్ల బీజేపీ లబ్ది పొందుతున్న ప్రచారం క్షేత్రస్థాయిలో ప్రారంభించింది. ఎంఐఎం పోటీ చేయనున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించింది. మొత్తం మీద అసుద్దీన్ ఒవైసీ మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి లబ్ది చేకూరుస్తారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Bihar Results in UP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page