రెండవ డిప్యూటీ  మేయర్ గా అవుతు శ్రీశైలజ

0 13

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడ నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ  మేయర్ ఎన్నికల ప్రక్రియను  ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. ప్రక్రియ అనంతరం 58 వ డివిజన్  కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజరెడ్డి  ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.  మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో   వియంసి రెండవ  డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా   విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు చెందిన 46 మంది వార్డు సభ్యులు ప్రత్యేక సమావేశానికి  హాజరు అయ్యారు.  కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో 58 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ శైలజ  పేరును  33వ డివిజన్ కార్పొరేటర్ వి.ఎన్.డి. ఎస్.ఎస్ మూర్తి  ప్రతిపాదించగా, 17 వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి బలపరిచారు.  మిగిలిన సభ్యుల నుంచి వేరే ప్రతిపాదన లేనందున,  సభ్యుల ఆమోదంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆవుతు శ్రీ శైలజ వియంసి రెండవ డిప్యూటీ మేయర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తో పాటు , ఎమ్మెల్సీ యండి.కరిమున్నిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వియంసి కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెలందుర్గ, పొర్ల్ లీడర్ వెంకట సత్యనారాయణ  నూతనంగా ఎన్నికైన రెండవ డిప్యూటీ మేయర్ శ్రీమతి ఆవుతు శ్రీ శైలజని పలువురు కార్పొరేటర్లు  అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Srisailaja will be the second deputy mayor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page