వివేకా కేసులో కొత్త ట్విస్టు

0 44

కడప  ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజురోజుకూ సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజురోజుకూ కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకు వస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో శుక్రవారం 54వ రోజు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు.అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్, గోవర్ధన్‌లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవలే కడప జిల్లా పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తి సీబీఐ విచారణ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సదరు వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం సునీల్ బంధువు యువరాజ్‌ను వెంటబెట్టుకొని అనంతపురం వెళ్లి వచ్చారు.గతంలో సునీల్ కుటుంబం అనంతపురంలో ఉండేది. ఇందులో భాగంగానే శుక్రవారం వారి బంధువులైన లోకేష్, గోవర్ధన్‌లను విచారిస్తున్నారు. మరోవైపు, పులివెందులకు చెందిన వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, అతని భార్య షబానాను సీబీఐ అధికారులు రాత్రి 10 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని శుక్రవారం ఉదయం వదిలి పెట్టారు. విచారణలో భాగంగా వారిని తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, ఇటీవలే వైఎస్ వివేకా వాచ్‌మెన్ రంగయ్య విచారణలో వెల్లడించిన విషయాలు సంచలనం రేకెత్తించాయి. రంగయ్య వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:New twist on the Viveka case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page