వైద్య విద్యా కోర్సుల్లో రిజర్వేషన్లు హర్షణీయం టీబీసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

0 17

జగిత్యాల ముచ్చట్లు:
వైద్యవిద్యాకోర్సుల్లో ఓబీసిలకు 27 శాతం ,ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వేలాదిమంది ఓబీసీ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అత్యున్నత వైద్యవిద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని టీబీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ రిజర్వేషన్ల ఖరారు తో  తెలంగాణలో 500 మంది విద్యార్థులకు అదనంగా లబ్ది చేకూరే అవకాశాలనున్నాయన్నారు. విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచించి చర్యలు చేపట్టడంపై కేంద్రప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రజలకు అందుబాటులో ఉండేలా థరూర్ క్యాంపులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు స్థల సేకరణ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం పట్ల జిల్లా యంత్రాంగానికి, జగిత్యాలఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్కెట్ డైరెక్టర్ బండారి విజయ్,ఉపాధ్యక్షులు సింగం భాస్కర్,శంకరయ్య, కొండా లక్ష్మణ్, ములస్తం శివప్రసాద్, కూసరి అనిల్ కుమార్,పంబాల రాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Reservations in medical education courses are delightful
TBC state president Hari Ashok Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page