షర్మిలకు కోమటిరెడ్డి హామీ

0 15

నల్గొండ  ముచ్చట్లు:
తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల నిదానంగా ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టిన షర్మిల అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. నిరుద్యోగులు, రైతులకు అండగా నిలబడే కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగులని ఆదుకోవాలని ఆమె దీక్షలు చేస్తున్నారు.తాజాగా ఆమె మునుగోడు నియోజకవర్గంలో నిరుద్యోగులకు అండగా ఒకరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షర్మిల దీక్షకు మద్ధతు తెలిపారు. దీక్షలో ఉన్న షర్మిలకు వీడియో కాల్ చేసి మరీ రాజగోపాల్ మద్ధతు తెలిపారు. అలాగే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని వేలమంది యువకులు బలిదానం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, కానీ తెలంగాణ యువతను కేసీఆర్‌ నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు.అయితే ఇలా కోమటిరెడ్డి, షర్మిలకు మద్ధతు ఇవ్వడంతో ఆయన వైఎస్సార్టీపీలోకి వెళ్తారా? అనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఇదివరకు బీజేపీలోకి వెళ్తానని ప్రకటించి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు షర్మిలకు మద్ధతు ఇచ్చారు. అయితే వైఎస్సార్ తనయురాలు కావడంతోనే, ఆ అభిమానంతో రాజగోపాల్, షర్మిలకు మద్ధతు ఇచ్చారని కోమటిరెడ్డి అనుచరులు చెబుతున్నారు.అయితే ఈ క్రమంలోనే కోమటిరెడ్డి, షర్మిలకు రాజకీయంగా ఓ హింట్ ఇచ్చినట్లు కనబడుతుంది. అది ఏంటంటే నల్గొండ జిల్లాలో వైఎస్సార్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని, గతంలో ఈ జిల్లాకు వైఎస్సార్ అండగా నిలిచారని చెప్పారు. అలాగే షర్మిలకు రాజకీయంగా ఎదగాలని కోమటిరెడ్డి పరోక్షంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే నల్గొండలో షర్మిల పార్టీ రాజకీయంగా బలపడటానికి ఛాన్స్ ఉందని ఇన్‌డైరక్ట్‌గా చెప్పినట్లు కనిపిస్తోంది.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Komatireddy guarantees Sharmila

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page