షర్మిల పార్టీకి ఇద్దరు రాజీనామా

0 26

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో రాజన్న సంక్షేమం రాజ్యం తేవాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పార్టీలో అప్పుడే అసమ్మతి రాగం వినపడుతోంది. రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనకు అండగా ఉంటామని వచ్చిన నేతలు.. ఒక్కొక్కరు జారిపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి వైఎస్ఆర్‌టీపీకి గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి ఇద్దరు నేతలు పంపించారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ టీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. జిల్లాలో కీలక నేతగా కేటీ నర్సింహారెడ్డి కొనసాగుతున్నారు. మరోవైపు, ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అన్ని జిల్లాలను చుట్టేయాలని ఆమె అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్ టీపీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తాను రాజీనామా చేయడానికి రాఘవరెడ్డి కారణమని చెబుతున్నారు. దీన్నిబట్టి ఆ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Two resign from Sharmila’s party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page