ఆరుగురు టీటీడీ ఉద్యోగులపై వేటు

0 10

తిరుమల ముచ్చట్లు :

 

ఆరుగురు టీటీడీ ఉద్యోగులను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ టీటీడీ పరిధిలోని వివిధ కేడర్లలో పనిచేస్తున్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులపై పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 2006-08 మధ్య కాలంలో ఆర్జిత సేవా టికెట్లను ఇష్టం వచ్చినట్టు విక్రయించినట్టు వీరిపై ఆరోపణలున్నాయి. తమ అనుకూల వ్యక్తులకు వస్త్రంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవా టికెట్లను 30 ఏళ్ల వరకు మొత్తం విక్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటకు రావడంతో 18 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Hunting for six TTD employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page