ఆస్తి పన్ను పెంపుపై అయ్యన్న పాత్రుడు ధర్నా

0 7

నర్సీపట్నం ముచ్చట్లు:

 

ఆస్తిపన్ను పెంపుపై మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడునిరసన ర్యాలీ , ధర్నా చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఆస్తి పన్నులు పెంచడం దారుణమని అయన అన్నారు. అయ్యన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అయన అన్నారు. ఇతర రాష్ర్టాల్లో పన్నులు సగం మేర తగ్గిస్తుంటే, ఆంద్రప్రదేశ్ లో మాత్రం వైసీపీ ప్రభుత్వం పన్నులను పెంచి వసూలు చేయడం  సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా పన్నులు పెంచడం  పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంమన్నారు.  పన్నులు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోని ఉన్న విలువ ఆధారంగా పెంచుతూ పోతే రిజిస్టర్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం ఖాళీ స్థలం, ఇంటి స్థలం తాలూకు విలువ పెరుగుతాది అంటే పన్నులు కూడా ఆ విలువతో పెరిగి పోతుంటే ఇంకా పన్నులు కట్టుకోలేక ఇళ్లు అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుందన్నారు. నర్సీపట్నంలో  ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పన్నులు తగ్గిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి, పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక టాక్స్ తగ్గించాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి  తగ్గించాలి కానీ దొంగ జీవోతో  ప్రజలను మభ్యపెట్టారన్నారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోను  తెచ్చి ప్రజల పై మరింత భారం మోపడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు.ఈ వైసీపీ ప్రభుత్వం  పన్నుల పెంపు నిర్ణయంపై అన్ని పార్టీలు కలిసి పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Dharna deserves to be on the property tax hike

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page