ఈపీఎఫ్ కింద రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు మెడికల్ అడ్వాన్స్

0 11

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

 

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ కింద రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి ముందు ఎటువంటి ఆసుపత్రి బిల్లులసమర్పించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్(సీఎస్(ఎంఎ) నియమాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద కవర్ అయ్యే ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ క్రింద తెలుసుకుందాం. నిబంధనల ప్రకారం రోగిని ప్రభుత్వ/పీఎస్ యు/సీజీహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒకవేళ రోగిని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే, అప్పుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు.
ఉద్యోగి లేదా వారి కుటుంబం అడ్వాన్స్ క్లెయిం చేయడం కొరకు ఆసుపత్రి, రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. వారు దరఖాస్తులో బిల్లు అంచనాను రాయాల్సిన అవసరం లేదు. రోగి కుటుంబానికి ఈ డబ్బు అడ్వాన్స్‌గా ఇవ్వవచ్చు లేదా రోగిని చేర్చిన నిర్ధిష్ట ఆసుపత్రికి నేరుగా చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ చికిత్స బిల్లు లక్ష పరిమితిని మించితే మరోసారి అడ్వాన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆసుపత్రిలో వేసిన అంచనా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. రోగి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులు ఈపీఎఫ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Medical Advance to employees registered under EPF

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page