ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి కృష్ణ మాధురి

0 19

నెల్లూరు  ముచ్చట్లు:
ఏఎస్ పేట మండలం కావలి ఎడవల్లి పంచాయితీ కార్యదర్శి కృష్ణ మాధురి ఏసీబీ దాడిలో దొరికిపోయారు.  నాలుగు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.  కార్యదర్శి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.  గ్రామానికి చెందిన జిల్లా తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు ఎం రమణయ్య పంచాయితీలో గత ఏడాది చేసిన వీధిలైట్ల బిల్లులు రూ 13500 డ్రా చేసి ఇచ్చేందుకు కార్యదర్శి 6000 లంచం డిమాండ్ చేశారు. దానికి గాను నాలుగు వేలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల్లూరు ఏసీబీ అధికారులను సంప్రదించిన రమణయ్య,  వారు ఇచ్చిన నాలుగు వేల రూపాయల నోట్లను సచివాలయం ఆవరణలో  కార్యదర్శికి అందజేశారు. అదే సమయంలో కాపుకాసి ఉన్న ఏసీబీ డీఎస్పీ వారి సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Panchayat Secretary Krishna Madhuri in the ACB net

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page