కమలాన్ని ఇరుకున పెడుతున్న కేసీఆర్

0 11

హైదరాబాద్   ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ కు అనుకూలంగానే పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీని నిలువరించేందుకు ఆయన వేసిన పథకం సక్సెస్ అయిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడితే రాజకీయ ప్రయోజనాలు మాత్రం కేసీఆర్ మరోసారి నెరవేర్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ వేసిన ప్లాన్ సక్సెస్ అయిందనే చెప్పాలి.రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొంత బలం పెంచుకుంటోంది. రానున్న కాలంలో మరింత ఎదిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తో పెద్దగా ప్రమాదం లేకపోయినా బీజేపీతోనే కీలక నియోజకవర్గాల్లో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో జలవివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. అది సాధ్యం కాదని తెలిసినా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఈ ప్రతిపాదనను కేసీఆర్ తెచ్చారు.మరోవైపు బీజేపీ జగన్ వైపు ఉంటుందని కేసీఆర్ కు తెలియంది కాదు. వచ్చే ఎన్నికల తర్వాత తన కన్నా జగన్ అవసరమే బీజేపీకి ఎక్కువగా ఉండనుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధుల నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేయడాన్ని కేసీఆర్ రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చేసిన రచ్చ కేసీఆర్ కు ఉపయోగపడనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఇది ఎంతోకొంత ప్రభావం చూపనుంది.తొలి నుంచి కేసీఆర్ కు కాంగ్రెస్ కంటే బీజేపీతోనే భయమెక్కువ. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో దూకుడు పెంచుతుందని తెలుసు. కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడం వెనక కూడా ఇదే కారణం. అందుకే జలవివాదాల్లో కేసీఆర్ అనుకున్నట్లుగానే బీజేపీ వ్యవహరించింది. దీనివల్ల తెలంగాణాలో బీజేపీని పూర్తిగా వెనక్కు నెట్టేయవచ్చన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారు. మొత్తం మీద బీజేపీ కేసీఆర్ ట్రాప్ లో పడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:KCR squeezing the lotus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page