కుక్కలపై దాడులా…

0 12

ఏలూరు    ముచ్చట్లు :
పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రదర్శించి తీరు ఇప్పుడు దుమారం రాజేసింది. లింగపాలెం పంచాయతీ అధికారులు ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. మూగజీవాలను అత్యంత పాశవికంగా, ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు.ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను పొట్టున పెట్టుకున్నారు. గుంతలో అలా పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. ఇది చూసిన జంతు ప్రేమికులు కంటతడి పెట్టుకుంటున్నారు.విశ్వాసానికి మారుపేరు గ్రామసింహాం. కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడి చేయవచ్చు, తీవ్రంగా గాయపరచవచ్చు. అయితే మాత్రం అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తారా? వాటిని వదిలించుకునేందుకు ఏకంగా చంపేస్తారా? వాటిపై విషం చిమ్ముతారా అంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. చనిపోయిన కుక్కల కళేబారాలను చెరువు వద్ద గొయ్యిలో పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది. ఈ చర్యలకు పాల్పడ్డ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పంచాయతీ అధికారుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. కుక్కలు తరచూ దాడులకు తెగపడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా పోగై రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్నాయని చెప్తున్నారు. ఈ కారణంగా విషం పెట్టి చంపినట్లు చెప్తున్నారు. ప్రజారోగ్యం రీత్యానే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్. వాస్తవానికి జంతుహింస నేరం, సృష్టిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కులను కాలరాసే అధికారం ఎవరికి లేదు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Attacks on dogs …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page