గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సహేతుకం కాదు

0 12

– ఖండించిన  బిసి మహిళా రక్షకదళ్

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

గోవా లోని పనాజీ గ్రామంలో జరిగిన సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బిసి మహిళా రక్షకదళ్ అధ్యక్షురాలు మత్త జయంతి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఈ విధంగా ప్రవర్తించడాన్ని యావద్దేశం కూడాదీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఆడపిల్ల మీద జరిగిన అత్యాచారం వ్యతిరేకిస్తూ వాళ్ళకి న్యాయం చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడాన్ని సహేతుకంకదని పేర్కొన్నారు.మహిళల పట్ల ఆడపిల్లల పట్ల గౌరవంలేని ఇలాంటి ముఖ్యమంత్రిలో రాష్ట్రానికి పనికిరాదని రాజీనామా చేయాలని జయంతి డిమాండ్ చేసారు. అర్ధరాత్రి ఆడ పిల్లలు ఎందుకు బయటకు పంపించారు? అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మగవారికి ఒక న్యాయం ఆడపిల్లలు ఒక న్యాయమా అనిప్రశ్నించారు.ఆడపిల్లల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇంట్లో ఉండమని జీవచ్ఛవంగా బతికించమని ఆదేశించే హక్కు ఈ ప్రభుత్వాలకు ఏ రాష్ట్రాలకి లేదని ఆడపిల్లల్ని గర్వంగా బ్రతకమని చెప్పే ముఖ్యమంత్రులు ఈ విధంగా మాట్లాడటం
సరికాదన్నారు.వీలైతే మగవాళ్ళని ఇంట్లో ఉంచమని జీవో పాస్ చేయాలన్నారు. ఆడపిల్లలకి సరైన న్యాయం చేయాలని పూర్తి రక్షణ కల్పించాలి  గాని చేతగాని ప్రభుత్వాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఆడ పిల్లలకి పూర్తి భద్రతతోపాటుపూర్తి రక్షణ కల్పించి వాళ్ల స్వేచ్ఛగా బ్రతికే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని జయంతి కోరారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Goa Chief Minister’s remarks are not reasonable

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page