జైలు గోడ కూలి 22 మంది ఖైదీలకు గాయాలు

0 9

మధ్యప్రదేశ్ ముచ్చట్లు :

 

జైలు బ్యారక్ గోడ కూలిన ఘటనలో 22 మంది ఖైదీలు గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా జైల్లో జరిగింది. గాయపడిన ఖైదీల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున ఆరవ నంబర్ బ్యారక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఖైదీలు గ్వాలియర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ జైలు భవనం పురాతనమైనది. దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో గోడ బాగా నానిపోయి కూలిపోయింది. ఈ జైల్లో ప్రస్తుతం 255 మంది ఖైదీలు ఉన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Prison wall crash injures 22 inmates

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page