దిశ ఆప్ పై విద్యార్థులకు అవగాహన

0 12

– విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై

తుగ్గలి ముచ్చట్లు:

 

- Advertisement -

మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక అనసూయ విద్యాసంస్థల యందు శనివారం రోజున కరస్పాండెంట్ గుర్రాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దిశ యాప్ పై ఎస్సై షామీర్ భాషా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూమహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు దిశ యాప్ ను ఆచరణలోకి తీసుకొని వచ్చారని తుగ్గలి యస్.ఐ షామీర్ భాష తెలియజేశారు.దిశ యాప్ ను ఇంటర్నెట్ ద్వారా ప్లేస్టోర్ లోడౌన్లోడ్ చేసుకోవాలని,దిశ యాప్ వినియోగానికి ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం అవసరం లేదని ఆయన తెలియజేశారు.ప్రస్తుత పరిస్థితులలో మహిళలు ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు దిశా యాప్ లో ఉండే సేవలను వినియోగించి తమను తామురక్షించుకోవడం అని ఎస్.ఐ తెలియజేశారు.మహిళలు ఏవైనా ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్లోని ఎస్.ఓ.ఎస్ (సేవ్ అవర్ సిస్టర్స్) బటన్ను నొక్కడం ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్తుంది,ఎస్.ఓ.ఎస్ బటన్ ను నొక్కినప్పుడు

 

 

 

 

సంఘటనా స్థలం వద్ద వీడియో,ఆడియో చిత్రీకరణ ఆటోమేటిక్ గా జరుగుతుందని, అనంతరం లొకేషన్ ఆధారంగా పోలీసులు త్వరగా సంఘటనా స్థలానికి చేరుకొని ఆపదలను అడ్డుకుంటారని ఎస్.ఐ తెలియజేశారు.చెవిటి మరియు మూగ మహిళలసౌకర్యార్థం దిశ యాప్ ను ఓపెన్ చేసి గట్టిగా మూడు సార్లు కుదపడం ద్వారా కూడా సంబంధిత సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్తుందని ఎస్ఐ తెలియజేశారు.దిశ యాప్ ద్వారా మహిళలకు ఎంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని,దిశా యాప్
ద్వారా అత్యవసరమైన మెడికల్,ఫైర్ తదితర వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చని ఎస్సై షామీర్ భాష తెలియజేశారు.కావున మహిళలు దిశ యాప్ ను వినియోగిస్తూ,మరో నలుగురు మహిళలకు సమాచారం అందించాలనిఎస్ఐ షామీర్ భాష తెలియజేశారు.దిశ యాప్ ద్వారా కేసు నమోదైతే నిందితుడిపై 14 రోజుల్లో విచారణ నిర్వహించి,21 రోజులలోపు శిక్షను ఖరారు చేస్తారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది,మహిళా పోలీసులు సుశీలమరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

30 మందితో యాబైఏళ్ల స్నేహితం-పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెల్లడి

Tags: Awareness for students on Direction App

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page