పలువురు టీడీపీ నేతలు ఆరెస్టు

0 13

విజయవాడ    ముచ్చట్లు:
కృష్ణాజిల్లా  కొండపల్లిలో జరిగిన అక్రమ మైనింగ్ పరిశీలనకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ నిజ నిర్థారణ కమిటీని పోలీసులు అడుగడుగున  అడ్డుకున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్ అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై కమిటీ  శనివారం క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమయింది.  దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. .కొండూరు మండలంలో రహదారులపై భారీగా పోలిసులు మోహరించారు. జి.కొండూరు లో ప్రధాన రహదారులలో  వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత రాత్రి నుంచి పలువురు పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, విజయవాడలో నాగుల్ మీరా, వర్ల రామయ్య, బొండా ఉమ, మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ల, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురామ్, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Several TDP leaders were arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page