బావితరాలకు ఆదర్శంగా మొ క్కలను పెంచుదాం

0 25

– అవగాహన సదస్సులో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
– మొ క్కలను సంరక్షణ బాధ్యత సర్పంచులదే
– కోరిన మొ క్కల సరఫరాచేస్తాం డ్వామా పీడీ

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

భావితరాలకు ఆదర్శంగా ఉండేందుకు రోడ్లకు ఇరువైపులా మొ క్కలను నాటి చెట్లు గా పెంచుదామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, అవెన్యూ ప్లాంటేషన్‌ సంరక్షులు, ఉపాధిసిబ్బందితో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డ్వామా పీడీ చంద్ర శేఖర్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో లక్ష మొ క్కలను నాటి, చెట్లుగా తీర్చిదిద్దడమేలక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో గల ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొ క్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మండలానికి 20 వేల వెహోక్కలు కేటాయించారని, గుంతలు తీసే పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ కోరిన మొ క్కను సరఫరా చేస్తామని, రాజమండ్రి నుంచి మొ క్కలు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాటిన మొ క్కలను సంరక్షించే భాద్యత ఆయా పంచాయతీల సర్పంచులదేనన్నారు.ప్రజా ప్రతినిథులు నాటిన ప్రతి మొ క్కను సంరక్షించి ఆదర్శపంచాయతీగా ఏర్పాటుకు పోటీ పడాలని కోరారు.మొ క్క నాటినప్పటినుంచి సంరక్షణ, నీటి సరఫరా, ఎరువులు వాడకంకోసం రెండేళ్ళపాటు ప్రభుత్వం ఉపాధి నిధుల ద్వారా ఆర్థిక చేయూతనిస్తోందన్నారు.అలాగే ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ చంద్రహాస్‌, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, ఎంపీడీఓ శంకరయ్య, డ్వామా ఏపీడీ శ్రీనివాసులు, ఏపిఓ శ్రీనివాసులు యాదవ్‌ తదితరులున్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Let’s grow the buds ideally for the wells

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page