భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

0 6

హైదరాబాద్ ముచ్చట్లు :

 

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో పర్యటించారు. ఇక్కడి భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత్ బయోటెక్ ను సందర్శించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. పలు విధాలుగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్ ఊహించని సవాళ్లు విసురుతోందని, ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న తక్షణావసరం మాత్రం వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమేనని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోకుండా వెనుకంజ వేయడం తగదని, వ్యాక్సినేషన్ డ్రైవ్ అఖిల భారతస్థాయిలో కొనసాగాలని ఆకాంక్షించారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Vice President Venkaiah Naidu visits Bharat Biotech

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page