మధుబన్ కాలనీలో భారీ చోరీ

0 13

రంగారెడ్డి  ముచ్చట్లు :
రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీ లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండగా మొదటి అంతస్తు భవనంపై వెనకాల నుంచి వెళ్లి కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు దాదాపుగా 15 తులాల బంగారం, 15 తులాల వెండి, 70 వేల రూపాయలు చోరీ చేసారు. శనివారం  ఉదయం మూడో అంతస్తులో ఇంటి ఓనర్ భారతమ్మ తన కొడుకు డీసీఎం డ్రైవర్గా పని చేస్తూ రాయచూరు కి వెళ్ళాడు. కోడలు పుట్టింటికి వెళ్లడంతో భారతమ్మ  కిందికి వచ్చి మొదటి అంతస్తులో చూసింది. తన కొడుకు ఊరికి వెళ్ళాడు అని తెలిసి కిందికి వచ్చి చూడగానే తాళం పగులగొట్టి ఉండేసరికి స్థానికులు సహాయం కోరింది. వెంటనే మైలార్ దేవ్ పల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో పాటు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Massive theft in Madhuban Colony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page