మిడ్ మానేరు నిర్వాసితుల ధర్నా

0 10

వేములవాడ ముచ్చట్లు :
మిడ్ మానేరు డ్యామ్ నిర్వాసితులు పరిహారం కోసం వేములవాడ కమాన్ వద్ద ధర్న్ చేపట్టారు. డ్యామ్ పూర్తయి ఏండ్లు గడుస్తున్న ప్రభుత్వానికి మాత్రము మా పై కనికరం లేదని, మా భూములు లాకొని మమ్ములను నట్టేట ముంచేసారని ధ్వజం ఎత్తారు. మాకు ఇచ్చే మా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ. ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు రోడ్డు పై ధర్నా, రాస్తారోకో నిర్వహించడం తో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని సర్ది చేప్పి లేపారు, ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణంలో మునిగి పోయిన మాకు నష్ట పరిహారం ఇవ్వని ఈ దద్దమ్మ హుజురాబాద్ లో దళితులకు దళిత బంధు ఇస్తాని ప్రకటించడం కేసీఆర్ మాయల మాటల గారడి అని ఎద్దవా చేశారు. ఆకలి ఉన్న వాలకు అన్నం పెట్టానోడు మీకు  పంచ పరామాన్నం పెడుతా అని హుజరాబాద్ దళిత ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమములో  బోయిన్ పెళ్లి మండలం కోదురుపాక, నీలోజిపల్లి, అనుపురం, కోడుముంజ  మిడ్ మానేరు డ్యామ్ ముంపు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Dharna of Mid Manor expatriates

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page