మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రసన్న

0 21

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, బసవాయ పాళెం లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి  నిధులు 5 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్ వో వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలకు నీటిని నింపిన కొత్త వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుండాలమ్మ పాళెం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా 93 మంది లబ్ధిదారులకు
ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి , ప్రజాసంక్షేమానికి అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రభుత్వ సేవలను కొనియాడారు.ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలోనెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్  ఛైర్మన్ వీరి చలపతిరావు , నెల్లూరు జిల్లా విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డిరంగారెడ్డి  , మండల పార్టీ అధ్యక్షులు గంధం శేషయ్య , బసవాయ పాళెం గ్రామ సర్పంచ్ పల్లేటి రజిని , స్థానిక ఎమ్మార్వో , ఎంపీడీవో మరియు వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

30 మందితో యాబైఏళ్ల స్నేహితం-పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెల్లడి

Tags: Ms. Prasanna, who started the mineral water plant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page