మీసం మెలేసాడంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు

0 31

అనంతపురం  ముచ్చట్లు:

 

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఇవాళ తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఆయన మీసం మెలేసి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులుపోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డిపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జిల్లాలోని పది మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్ల ఎన్నిక ముగిసింది. తాడిపత్రిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి నాలుగో వార్డుకౌన్సిలర్ అబ్దుల్ రహీంకు ఆ పదవి దక్కింది. దీంతో అధికార పార్టీ గైర్హాజరు కావడం విచిత్రంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆయన సెటైర్లు వేశారు. పెద్దారెడ్డి మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదని,పెద్దారెడ్డి తన మొహాన్ని ఓసారి అద్దంలో చూసుకోవాలని అన్నారు. దమ్ముంటే సెంటర్‌లోకి రా చూసుకుందామని జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.

- Advertisement -

30 మందితో యాబైఏళ్ల స్నేహితం-పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెల్లడి

Tags: Police have registered a case against former MLA Jesse Prabhakar Reddy for having a mustache

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page