రామసముద్రంలో పలుగు పార పట్టిన పంచాయతీ కార్యదర్శి

0 43

రామసముద్రం ముచ్చట్లు:

 

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ గ్రామాల్లో తన అధికారంతో సిబ్బందిని అజమాయిషి చేస్తూ పనులు చేయించాల్సిన పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పలుగు, పార పట్టి పారిశుద్ధ్య కార్మికుని అవతారంమెత్తాడు. మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి కేసి.పల్లి గ్రామంలో గత కొంతకాలంగా ప్రధాన రహదారి పక్కన తాగునీటి పైపు లైన్ లీకేజీతో నీరు కలుషితమై వృధాగా పోవడమే కాకుండా వీధుల్లో పారుతూ రాకపోకలకు అంతరాయం కలిగేది. దీంతో ఎవరు పట్టించుకోక స్థానికులు తీవ్ర అసహనానికి గురై కార్యదర్శి కి విన్నవించగా తానే పలుగు, పార పట్టి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమణారెడ్డి సహకారంతో మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో స్థానికులు, సచివాలయం సిబ్బంది కార్యదర్శి ని చూసి ఆశ్చర్యపోయారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Panchayat secretary who shoveled in Ramasamudram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page