వరి నాట్లకు ఎన్నోపాట్లు

0 48

– కూలీలు దొరక్క ఇబ్బందులు
– పెరిగిన డీజల్ ధరతో రైతులు ఆందోళన
రామసముద్రం ముచ్చట్లు:

జిల్లాలోని పడమటి మండలాలు అయిన పుంగనూరు, రామసముద్రం మండలాల్లో వరి నాట్లు మొదలైనాయి. పలు గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ పొలాలను ముందే సిద్ధం చేసుకున్నారు. ఈమధ్య కాలంలో కురిసిన వర్షాలకే రైతులు తమ వ్యవసాయ భూములను సాగుకు అనువుగా తయారు చేసుకున్నారు. రైతులు వేరుశనగ విత్తనాలు విత్తిన సమయంలోనే వరి సాగుకు సైతం నార్లు పోసుకున్నారు. ప్రస్తుతం టమాటో పంటల కోతల వస్తుండటంతో వేరుశనగ తదితర పంటలు కలుపుకు రావడం, అదే సమయంలో నారు ఎదిగి నాటుకు సిద్ధం కావడంతో కూలీల కొరత ఏర్పడింది. గ్రామాల్లోని కూలీలు సరిపోక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి పనులకు వచ్చే కూలీలు రైతులకు ఆటో ప్రయాణ ఖర్చులు కాకుండా రూ.250ల నుంచి రూ. 350లు వెచ్చిస్తున్నారు. పంట మార్పిడి విధానంతో అధిక లాభాలు ఉంటాయని రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమౌతున్నారు. రైతులు వరి, టమాటో సాగుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విత్తనాలు వేసే సమయంలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. కాడెద్దులు కరువు అవడంతో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వచ్చింది.

- Advertisement -

“”పెరిగిన డీజలు ధరలతో రైతన్న ఆందోళన””

మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా ప్రకృతి వైపరీత్యాలతో సతమవుతున్న రైతన్నపై డీజలు రూపంలో మరో అదనపు భారం పడుతోంది. జిల్లాలో అడపా దడపా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ సీజన్‌కు రైతన్న సమాయత్తమవుతున్న వేల వరుసగా పెరుగుతున్న డీజలు ధరలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రోజు డీజలుపై రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ట్రాక్టరుతో చేసే సేద్యం ఖర్చులన్నీ పెరగనున్నాయి. ఒకప్పుడు ఏ పల్లెలో చూసినా రైతుల ఇళ్ల ముందు కాడెద్దులు, పశువులు, వ్యవసాయ సామగ్రి కనిపించేవి. కాలక్రమేణా ఎడ్ల పోషణ భారంగా మారడం, కూలీలు దొరక్కపోవడం, కూలీ రేట్లు ఎక్కువ కావడంతో… సేద్యపు ఎద్దులు, పనిముట్ల స్థానంలో ట్రాక్టర్లు, యంత్రాలు ఆక్రమించాయి. ఇప్పుడు ఎక్కడో తప్ప కాడెద్దులు కనిపించవు. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు, మందుల పిచికారి కోసం యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డీజలు ధరలు ఇప్పుడు రైతుకు అదనపు భారమవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతులకు కూలీల కొరత నుంచి ఊరట కలుగుతుందని రైతులు కోరుతున్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Many times for rice seeds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page