విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ

0 8

విశాఖపట్నం ముచ్చట్లు :

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పలు ఐటీ కంపెనీలు తమ యూనిట్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దీనివల్ల ప్రధానంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రస్తుత సాంకేతిక అవసరాలతోపాటు విద్యార్థులకు అవసరమైన ఐటీ పరిజ్ఞానం, నైపుణ్యాలు అందుతాయి. అంతేకాకుండా వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఐటీ రంగంలో వస్తున్న కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తారు. ఈ వర్సిటీలో రెగ్యులర్, పార్ట్‌టైమ్‌ ఐటీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడతారు. మొత్తంగా రాష్ట్ర చిత్రపటంలో విశాఖ మెగా ఐటీ హబ్‌గా అవతరించనుంది.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:IT Emerging Technologies Research University in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page