విశాఖలో ఖతర్నాక్ దొంగల ముఠా

0 13

విశాఖపట్టణం  ముచ్చట్లు :
వైజాగ్‌లో ఖతర్నాక్‌ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోరీకి ఈ ముఠా ప్లాన్‌ వేసింది. అక్కడ తేడా కొట్టడంతో తప్పించుకుని కారులో వైజాగ్‌కు పారిపోయారు. దీంతో రాజాం పోలీసులు చేజింగ్‌ చేశారు. ఇటు వైజాగ్‌ పోలీసులను అలర్ట్‌ చేయడంతో చాకచక్యంగా వారిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బంగారం దుకాణాలనే ఈ ముఠా టార్గెట్‌ చేస్తోంది. ఈనెల 27న శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోరీకి పాల్పడింది. తిరిగి వచ్చి బంగారం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి ముఠాలోని ముగ్గురు అక్కడ పట్టుబడ్డారు. మరో ముగ్గురు కారులో పారిపోయారు. విశాఖ వైపు వారు పారిపోతున్నారని తెలుసుకుని…అక్కడి పోలీసులకు రాజాం పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో సినీ స్టైల్లో కారును ట్రాక్‌ చేసి దొంగల ముఠాను పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వీరు.. షాపులకు వెళ్లి రోల్డ్‌ గోల్డ్‌ పెట్టి అసలు బంగారు నగలను ఎత్తుకెళుతున్నారని పోలీసులు కనిపెట్టారు.ఆ ఇద్దరిని ఎవరు హత్య చేశారు..? ఇంట్లోనే మర్డర్ చేశారా..? హత్య ఎక్కడో చేసి ఇంట్లో పెట్టారా..? అసలు ఎందుకు హత్యలు చేశారు..? ఆస్తి గొడవలా..లేక ఇంకైదైనా కారణాలా.. అసలేం జరిగింది..? గుంటూరు జిల్లా తాడేపల్లి జరిగిన డబుల్ మర్డర్స్ .. లోకల్‌గా హాట్ టాపిక్ అయ్యింది. మీరు చూస్తున్న ఈ విజువల్స్ తాడేపల్లిలోని ఓ ఇంట్లో లభ్యమయ్యాయి ఇద్దరి డెడ్ బాడీలు.. కుళ్లిపోయి ఉన్నాయి. ఎలా చనిపోయారు.. ఎందుకు చనిపోయారు..? హత్యలు చేసి ఇక్కడ పడేశారా.. ఆత్మహత్యలు చేసుకున్నారా..? ఇంటికి తాళం వేసి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు స్థానికులు. మృతులు 12 ఏళ్లుగా తాడేపల్లిలో ఉంటున్నారన్నారు. వీళ్లతో ఎవరికీ పెద్దగా పరిచయాలు లేవుంటున్నారు. మరి ఈలాంటప్పుడు ఈ హత్యలు ఎలా జరిగాయి..? మూడ నమ్మకాలతో ఏదైనా జరిగిందా ..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేసి.. దహనసంస్కారాలు చేశారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Khatarnak gang of thieves in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page