సమాజ సేవకు 2021 స్ఫూర్తి సేవా పురస్కారాల ప్రధానం

0 19

– ఆనందయ్య కుమారుడు లక్ష్మీధర్ కు ఘన సన్మానం

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 14 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని టౌన్ హాల్ నందు శనివారం నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగాసమాజ సేవకులకు స్ఫూర్తి సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణ కు ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణీ చేసిన బొనిగి ఆనందయ్య కుమారుడు లక్ష్మీధర్ ను ఘనంగా సత్కరించారు . అదే క్రమంలో ఆపత్కాలవిపత్కర పరిస్థితులలో తమ వంతు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించిన సరస్వతి ,పద్మజ, బత్తుల నరేష్ కుమార్, డాక్టర్ ఆషిఫ్ అహ్మద్, డాక్టర్ గుర్రంకొండ సర్దార్, పి.జోషప్ రాజు, డాక్టర్ పి.ముత్తు, కె.ఎస్.వి. కిరణ్ కుమార్, పి.ఎల్.రావు,మీసాల వజ్రమ్మ, పిగిలాం వెంకట కిషోర్ కుమార్, డాక్టర్ వై.విజయ సాయి కుమార్ లకు శాలువాలు కప్పి, మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి సన్మాన గ్రహీతకు మొమెంటో,శాలువా,సర్టిఫికేట్, మెడల్, పూలమలతో”స్ఫూర్తి” పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ కె.మురళి మోహన్, నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ ఆఫీసర్ ఆకుల మహేంద్ర రెడ్డి, ఎపి.బి.సి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెర్నపాటి శ్రీరామరాజు,పినాకిని యూత్ వెల్ఫేర్అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు, అందే శ్రీనివాసులు, వై.చంద్రశేఖర్ రెడ్డి, రవి గోగులపల్లి, షేక్ రియాజ్ భాష, టి.వెంకటేశ్వర్లు, పుట్టా మస్తాన్ రెడ్డి, తంబి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

30 మందితో యాబైఏళ్ల స్నేహితం-పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెల్లడి

Tags: The 2021 Inspirational Service Awards for Community Service are a priority

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page