సామాజిక సమతుల్యతను పాటిస్తున్నముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

0 9

అమరావతి  ముచ్చట్లు :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం అని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్‌ చైర్మన్ పదవులు ఇచ్చామని తెలిపారు.సీఎం జగన్ పాలనను అన్నివర్గాలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు వారిని మోసం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ స్థానాలన్నీ అగ్రవర్ణాలకే ఇచ్చారని.. ఐదేళ్లలో ఒక్క రాజ్యసభ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకురారని మండిపడ్డారు.‘‘మైలవరంలో అలజడి సృష్టించేందుకు దేవినేని ఉమ ప్రయత్నించారు. కుట్రలో భాగంగానే వివిధ వర్గాలను రెచ్చగొట్టారు. ఉమ అనుచరుల చేతిలో గాయపడ్డవాళ్లే కేసులు పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకే పోలీసులు కేసులు నమోదు చేశారని’’ పేర్నినాని అన్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Chief Minister YS Jagan maintains social balance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page