హనుమాన్ దేవాలయం తొలగిస్తే తీవ్ర పరిణామాలు-బజరంగ్ దళ్

0 19

హైదరాబాద్ ముచ్చట్లు :
ఫిలింనగర్ లోని పటేల్ నగర్ లో గల పురాతన హనుమాన్ ఆలయాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బజరంగ్దళ్ వచ్చింది.  శనివారం సుమారు 100 మంది బజరంగ్దళ్ కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తానని మండిపడ్డారు. ఈ భూ కుంభకోణం సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2008వ సంవత్సరంలో ఈ వేలం ద్వారా బాచుపల్లి ప్రాంతంలో కేటాయించిన భూమిని ఇక్కడ కేటాయించాలంటూ సదరు సంస్థ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  స్థానిక నేతలకు కొంత ముట్టజెప్పి వేల కోట్ల విలువైన భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Severe consequences if Hanuman temple is demolished-Bajrang Dal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page