30 మందితో యాబైఏళ్ల స్నేహితం-పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెల్లడి

0 229

పుంగనూరు ముచ్చట్లు:

 

స్నేహమేరా జీవితం…. అనే నినాదంతో ఎల్‌కెజి చదువు నుంచి నేటి వరకు 90 మందితో స్నేహం కొనసాగిస్తూ ,ప్రతి యేటా స్నేహితుల దినోత్సవం రోజున 40 మందికి తక్కువ లేకుండ కలవడం , కష్టాలు, సుఖాల్లో పాలుపంచుకోవడం, ప్రముఖ పుణ్యక్షేత్రంలో తిరుపతి ఫ్రెండ్స్ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న ఈ స్నేహితుల వివరాలు పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీపీఎం జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కందారపు మురళి, వ్యవసాయశాస్త్రవేత్త శివకుమార్‌, క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌, ప్రకృతి ప్రేమికుడు , ట్రెక్కింగ్‌ వ్యవస్థాపకుడు సుబ్రమణ్యం, కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి, టీటీడి ఏఈ బాలచంద్ర, వ్యాపారవేత్త అర్జున్‌ వారి మిత్రబృందం తిరుపతి భవాని నగర్‌లోని ఇమ్మానియల్‌ ఇం•ష్‌ మీడియం స్కూల్‌లో 6 వ తరగతి వరకు చదివారు. పదో తరగతి వరకు నెహ్రు మున్సిపల్‌ హైస్కూల్‌లో 90 మంది స్నేహితుల బృందం చదువులు కొనసాగించారు. ఇందులో కొంత మంది మరణించారు. మిగిలిన వారు పై చదువులు పట్టణంలోని వివిధ కళాశాలల్లో చదివారు. కానీ అందరు తిరుపతి పరిసరాలలోనే నివాసం ఉండటం గమనార్హం. ఈ బృందంలో చిరు ఉద్యోగి నుంచి పై అధికారి వరకు ఉన్నారు. వారానికొక్కసారి సుమారు 30 మంది మిత్రులు కలుస్తుంటారు. అలాగే 1995లో తొలిసారిగా పూర్వపు విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలు ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోంది.

 

- Advertisement -

మరుపురాని సంఘటనలు….

తిరుపతిలోని నెహ్రు మున్సిపల్‌ హైస్కూల్‌లో స్నేహితుల దినోత్సవం రోజున 2012లో నెహ్రు విగ్రహం ఏర్పాటు చేయడం మరువలేనిది. అలాగే ఆపాఠశాలకు కావాల్సిన వసతులు, మరమ్మతులు సొంత నిధులతో చేపట్టడంతో పాటు మా ఉన్నతికి కారకులైన గురువులకు ప్రతియేటా సన్మానించి ఆర్థిక సహాయం అందించడం మహాద్భాగ్యంగా భావిస్తాం. అలాగే అన్నమాచార్య కళాకారులకు ప్రతియేటా తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తాం. మా మిత్రుల వద్దకు వచ్చే ఎవరికైనా తమవంతు సహాయం అందించడం అలవర్చుకున్నాం .

వర్మ మనోగతం….

నేను తిరుపతి మున్సిపాలిటిలో ఆర్‌వోగా పని చేస్తూ 2008లో మార్చి 8న ఆదివారం ఉదయం ఇంటిలో ఆనారోగ్యానికి గురై ఆపస్మారక స్థితిలో పడిపోవడంతో నా భార్య ఉషా కందారపు మురళికి ఫోన్‌ చేసి విషయం తెలిపింది. నిమిషాల వ్యవధిలో మిత్రులు కందారపు మురళి, దివంగత మబ్బుచెంగారెడ్డి, కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌, అర్జున్‌, కులశేఖర్‌, కందారపు సురేంద్ర హుఠాహుఠిన ఇంటికి చేరుకుని నన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. 9 రోజులు పాటు ఆసుపత్రిలో దగ్గరుండి మందులు ఇవ్వడం , భోజనం పెట్టడంతో పాటు అనేక సేవలు అందించారు. ఆరోగ్యం బాగుపడిన వెంటనే డిస్‌చార్జ్ చేసి, ఇంటికి తీసుకొచ్చారు. స్నేహితుడి క్షేమాన్ని కాంక్షించిన మిత్రులకు నా కృతజ్ఞతలు. చిన్ననాటి జ్ఞాపకాలతో స్నేహాన్ని యాబై సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నాం. ప్రస్తుతం కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా అందరిని కలవలేకపోవడం బాధగా ఉంది.

-కెఎల్‌.వర్మ. మున్సిపల్‌ కమిషనర్‌ , పుంగనూరు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Fifty-year-old friend with 30-Punganur Commissioner KL Verma revealed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page