ఆగ‌స్టు 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు,శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

0 9

తిరుపతి    ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.

- Advertisement -

ఆగస్టు 8వ తేదీన ఆల‌యంలో శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్ సాత్తుమొర‌, శ్రీ ప్ర‌తివాది భ‌యంక‌ర అన్న‌న్ సాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 11న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపును కోవిడ్‌-19 కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా ఆల‌యంలోనే ఉభ‌య‌దారులు ఉభ‌యం స‌మ‌ర్పిస్తారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Andal Thiruvadipuram Festival at Sri Govindarajaswamy Temple from 2nd to 11th August

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page