ఎట్టకేలకు లేడీ డాన్ అనురాధ చౌదరి అరెస్ట్

0 29

ఢిల్లీ ముచ్చట్లు :

రాజస్థాన్ కు చెందిన కరుడుగట్టిన లేడీ డాన్ అనురాధ చౌదరిపై అనేక హత్య కేసులు, దోపిడీ, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తాజాగా ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ చౌదరి గతంలో ఆనంద్ పాల్ సింగ్ అనే గ్యాంగ్ స్టర్ తో సహజీవనం చేసింది. 2017లో ఆనంద్ పాల్ సింగ్ రాజస్థాన్ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అప్పుడు అనురాధ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత ఆమె పోలీసుల నుంచి తప్పించుకుంది. కొంతకాలం తర్వాత సందీప్ అలిసాయస్ కాలా జతేదీ అనే మరో గ్యాంగ్ స్టర్ తో జతకట్టింది. కొన్నినెలలుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అనురాధ చౌదరి పురుష గ్యాంగ్ స్టర్లకు తీసిపోని రీతిలో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అనేక హత్యలు, దోపిడీ కేసులు ఉన్నాయి. ఆమె కోసం చాలా రాష్ట్రాల్లో గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Lady Don Anuradha Chaudhary finally arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page