కన్నుల పండువగా షణ్ముఖస్వామి కళ్యాణోత్సవం

0 20

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక బజారువీధిలో వెలసిన శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీ వళ్ళీదేవసేన సమేత శ్రీషణ్ముఖ సుబ్రమణ్యస్వామి వారికి కన్నుల పండువగా కళ్యాణోత్సవం జరిగింది. ప్రధానఅర్చకులు రాజశేఖరధీక్షితులు , కుమారస్వామి,మహేష్‌ స్వామిల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా రంగురంగు పూలతో ముస్తాబుచేశారు.అంతకుముందేఉదయం స్వామివార్లకు అభిషేకాలు,ప్రత్యేకపూజలు,అర్చనలు నిర్వహించారు.హిందూ సాంప్రదాయరీతితో వేద మంత్రోచ్చారణల మద్య మంగళవాయిద్యాల మేళతాళాలచే వేడుకగా కళ్యాణోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు ఉభయదారులుగా వ్యవహరించారు.అలాగే వివిధ గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణోత్సం అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

- Advertisement -

భరణికావిళ్ళు చెల్లింపు

పసుపు రంగు బట్టలు ధరించి డప్పు వాయిధ్యాలమద్య కావిళ్ళతో పురవీధుల్లో భరణికావిళ్ళ చెల్లిస్తున్నభక్తులు ఊరేగింపుగా హరోం…హరా అంటూ ఆలయం వద్దకు చేరుకొన్నారు. కొందరు భక్తులు తమ భక్తిపారవశ్యంను చాటిచెబుతూ నాలుకతోపాటు నోటిలో త్రిశూలంను కుచ్చుకొని వెహోక్కు చెల్లించారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Shanmukhaswamy Kalyanotsavam is a festival of the eyes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page