కాందహార్ విమానాశ్ర‌యంపై తాలిబన్ల దాడి

0 17

ఆఫ్ఘ‌నిస్థాన్ ముచ్చట్లు :

ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబ‌న్లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త రాత్రి రెండు రాకెట్లు విమానాశ్ర‌యంలోని రన్‌వేపై వ‌చ్చి ప‌డ‌డంతో విమాన రాక‌పోక‌ల‌కు తాత్కాలికంగా అంతరాయం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం రన్‌వే మ‌ర‌మ్మ‌తు ప‌నులు జ‌ర‌గుతున్నాయ‌ని, ఈ రోజు మధ్యాహ్నంలోపు విమాన సేవలు పునరుద్ధరించే అవకాశాలు ఉన్న‌ట్లు అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. కాగా, ఇప్ప‌టికే ఆఫ్ఘ‌న్‌లోని అనేక ప్రాంతాల‌ను త‌మ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబ‌న్లు కాందహార్ ను కూడా స్వాధీనం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విమానాశ్ర‌యంపై దాడుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Taliban attack on Kandahar airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page