జిఎస్‌టి చెల్లింపుల‌పై టిటిడికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శంస‌

0 21

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

జిఎస్‌టి చెల్లింపుల‌కుగాను టిటిడికి కేంద్ర ప్ర‌భుత్వం నుండి ప్ర‌శంస ప‌త్రం ల‌భించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టిటిడి జిఎస్‌టి రిజిస్ట్రేష‌న్ చేసుకుంది. ఇందుకుగాను రెండు రాష్ట్రాల్లో టిటిడి జ‌రిపిన లావాదేవీల‌కు సంబంధించి జిఎస్‌టి చెల్లింపుల‌కుగాను ఈ ప్ర‌శంస ల‌భించింది.దేశంలో 1.3 కోట్ల సంస్థ‌లు జిఎస్‌టి రిజిస్ట్రేష‌న్ చేసుకోగా ఇందులో 54,439 సంస్థ‌లు జిఎస్‌టిని ఖ‌చ్చితంగా చెల్లిస్తున్నాయి. 2017వ సంవ‌త్స‌రంలో దేశంలో జిఎస్‌టి ప్ర‌వేశ పెట్టి 4 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా క్రమం తప్పకుండా ప‌న్నులు చెల్లించిన వారిని స‌న్మానించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఇందులో భాగంగా 2021 మార్చి 31వ తేదీ వ‌ర‌కు జిఎస్‌టి రిట‌ర్న్ ఫైల్ చేయ‌డంలోనూ, ప‌న్ను చెల్లింపులకుగాను టిటిడికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శంస ప‌త్రం అందించింది.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Central Government commends TTD on GST payments

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page