టోక్యోలో ఒకే రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు

0 11

టోక్యో ముచ్చట్లు :

జపాన్ రాజధాని టోక్యోలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓవైపు ఒలింపిక్స్ జోరుగా సాగుతుండగా, మరోవైపు కరోనా చాపకింద నీరులా చుట్టుముడుతోంది. నిన్న ఒక్క రోజులోనే ఏకంగా 4,058 కేసులు నమోదయ్యాయి. రాజధానిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్ క్రీడాగ్రామంలోనూ 21 మంది కొవిడ్ బారినపడ్డారు. జులై 1 నుంచి ఇప్పటి వరకు 241 మందికి కరోనా సోకింది. టోక్యోలో ప్రస్తుతం ‘అత్యవసర పరిస్థితి’ అమల్లో ఉంది. తాజా కేసుల నేపథ్యంలో మరో నాలుగు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:More than 4,000 corona cases in a single day in Tokyo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page