భక్తులతో కిటకిటలాడినబోయకొండ

0 16

–కిక్కిరిసిన క్యూలైన్లు
–ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దితో కిటకిటలాడింది. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గంగమ్మ తలీ్ల మా కోర్కెలు తీర్చి మమ్మల్ని ఆశీర్వదించమ్మా…అంటూ భక్తులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి వెహోక్కులు చెల్లించారు. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీతో ఒక్కసారిగాపెరగడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లులో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సీఐ మధుసూధనరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ రవికుమార్‌ బందో బస్తు నిర్వహించారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Kitakitaladinaboyakonda with devotees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page