రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు

0 34

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర ఒక డీఏను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జనవరి నుంచి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2019 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏను జూలై జీతంతో పాటు విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 2019 జనవరి నుంచి 2021 జూన్‌ వరకు ఇవ్వాల్సిన బకాయిలను మూడు విడతల్లో జీపీఎ్‌ఫలో జమ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పెన్షనర్లకు సైతం డీఏ 3.144శాతం పెంచుతూ 2019 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏను 2021 జూలై నుంచి అమలుచేస్తామంటూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ మధ్యకాలంలోని బకాయిలను 2021 జూలై నుంచి మూడు విడతల్లో విడుదల చేస్తారని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30శాతం హెచ్‌ఆర్‌ఏను కొనసాగిస్తూ ప్రభుత్వం మరో జీఓ ఇచ్చింది.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Grant a DA to state government employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page