శ్రీవారికి పెరిగిన భక్తుల తాకిడి..

0 12

తిరుమల  ముచ్చట్లు :

శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి మళ్లీ మొదలైంది. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య గత కొన్ని నెలలుగా పడిపోయింది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండడం, ఆంక్షలు సడలించడంతో భక్తుల ప్రవాహం మళ్లీ మొదలైంది. ఫలితంగా గత నెలలో శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. గత నెలలో 5,32,780 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2,55,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, శ్రీవారికి గత నెలలో రూ. 55.55 కోట్ల హుండీ ఆదాయం లభించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Increased number of devotees to Srivastava ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page