సుపరిపాలనే సీఎం జగన్ ధ్యేయం – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 99

– కోడి కూయక ముందే పింఛన్లు పంపిణీ
రామసముద్రం ముచ్చట్లు:

సుపరిపాలనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆదివారం వేకువ జామునే వాలింటర్లు జగనన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోనే కెసిపల్లి పంచాయతీ నిర్దేశించిన సమయానికి కన్నా ముందే లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలని సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి వాలింటర్లతో పాటు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కోడి కూయక ముందే పింఛన్లు లబ్ధిదారుల ముంగిట వాలుతున్నాయన్నారు. పక్క రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకుని పాలన సాగించేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకో… దాచుకో అనే సిద్దాంతంతో పాలన చేస్తే… ప్రస్తుత ప్రభుత్వం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అందజేయడానికి జగనన్న సైనికులుగా పిలవబడే వాలింటర్లు పోటీ పడి మరి అందజేస్తున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మెంబర్లు సూచించిన వారికే సంక్షేమ పథకాలు….ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, కార్డులు, గృహాలు అందుస్తున్నారని కొనియాడారు. వాలింటర్లు కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కష్టపడి పని చేస్తున్నారని సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, విటి.జయచంద్ర, నాగరాజ, ఆంజప్ప, చౌడప్ప, వాలింటర్లు శ్రావణి, మేఘన, దినకర్, కుమారస్వామి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Good governance is the goal of CM Jagan – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page