2 నుండి 11వ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

0 12

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.ఆగస్టు 8వ తేదీన ఆల‌యంలో శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్ సాత్తుమొర‌, శ్రీ ప్ర‌తివాది భ‌యంక‌ర అన్న‌న్ సాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 11న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపును కోవిడ్‌-19 కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా ఆల‌యంలోనే ఉభ‌య‌దారులు ఉభ‌యం స‌మ‌ర్పిస్తారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Andal Thiruvadipuram Festival at Sri Govindarajaswamy Temple from 2nd to 11th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page