అంగన్వాడీ వర్కర్ ఉద్యోగ నియామక పత్రాలు, బెదిరించి లాక్కున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

0 10

నెల్లూరు ముచ్చట్లు:

 

 

చేతికి వచ్చిన అంగన్వాడీ వర్కర్ నియామక పత్రాలను దారిలో అడ్డగించి, బెదిరించి లాక్కున్న వారిపై  విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఎర్రమతి ప్రసూన జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వాకాడు మండలం, నెల్లిపూడి గ్రామము – హరిజనవాడ కాపురస్తురాలు యర్రమతి ప్రసూన భర్త ఇంగిలాల భాస్కర్ గూడూరు డివిజన్ – వాకాడు మండలం, నెల్లిపూడి గ్రామ హరిజనవాడలో వున్న సెంటర్ కు నన్ను అంగన్వాడీ వర్కర్ (టీచరు) గా ఎంపిక చేసి నాకు అపాయింట్మెంట్ అర్డరు నా చేతికి ఇచ్చి మళ్ళీ బలవంతంగా పేరుకోవడం .
ఇదేవిధంగా గతంలో కూడా మా బంధువులు అయినటువంటి ఆడబిడ్డ అయినా మహిళ కు కూడా సెలక్షన్ లిస్టులో పేరు వచ్చిన తర్వాత ఇదే విధంగా స్థానికులు తప్పుడు ఫిర్యాదులు వల్ల మమ్మల్ని తొలగించడం మా కుటుంబాలకు జరుగు అన్యాయాలకు నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా, వాకాడు మండలం, నెల్లిపూడి గ్రామ హరిజనవాడకు చెందిన ఇంగిలాల భాస్కర్ తండ్రి పోలయ్య అను నా భర్తకు ఇచ్చి వివాహము చేసినారు. నేను గత 14 సంవత్సరముల నుండి నెల్లిపూడి గ్రామ స్థానికురాలిగా వుంటున్నాను. నేను వాకాడు మండలం, నెల్లిపడి గ్రామ హరిజనవాడలో ఖాళీగా వున్న అంగన్వాడి వర్కర్ (టీచర్) ఉద్యోగమునకు 2021 జూన్ 19న  దరఖాస్తు చేసుకొన్నాను.
నేను ఇంటర్యూకి  తే 2021 జూలై 13న  గూడూరు ఆర్.డి.ఓ ఆఫీసుకు రమ్మని నాకు కాల్ లెటర్ పంపించారు. నాకు గూడూరు ఆర్.డి.ఓ. ఆఫీసు నందు ప్రొసీడింగ్ నెం. 27/ఎ/2021 రు గల అంగన్వాడీ వర్కర్ (టీచరు) నియామక ఉత్తర్వు (అపాయింట్మెంట్ ఆర్డరు) కాపీని 2021 జూలై 26న  సాయంత్రం గం॥5.00 లకు నా చేతికి ఇచ్చినారు. సదరు నియామక ఉత్తర్వును తీసుకొన్నాక నా దగ్గర నుండి జాయినింగ్ లెటరును కూడా తీసుకున్నారు.
నేను నా స్వగ్రామమైన నెల్లిపూడి గ్రామ పొలిమేరలకు చేరేసరికి, అదే రోజు అనగా  సాయంత్రం గం||7.00 లకు  నెల్లిపూడి గ్రామ సచివాలయం మహిళా పోలీసు అమరావతి, కోట ఐ.సి.డి.యస్. సూపర్వైజర్ పద్మమ్మ మరియు చంద్రశేఖర్ తదితరులు వెంబడించి, ఆపి నా చేతిలో ఉన్న అంగన్వాడీ వర్కర్ నియామక ఉత్తర్వును బెదిరించి లాక్కెళ్ళారు అని ఆరోపించారు. దాంతో నేను నిరాశ, నిస్పృహలకు లోనైనానని తన ఆవేదన వ్యక్తపరిచారు . ఈ విషయమై అధికారులు స్పందించి, విచారించి నాకు తిరిగి అంగన్వాడి వర్కర్ ఉద్యోగ నియామక పత్రమును ఇప్పించి ,సదరు ఉద్యోగమును నాకు కేటాయించి ,నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:Anganwadi worker employment documents, legal action should be taken against those who are threatened

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page